Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • PM Modi AP Tour
  • HYD BJP Meeting
  • BJP Vijaya Sankalpa Sabha
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News China Blocks Us India Move To List Pakistani Terrorist In United Nations

China-India: మరోసారి చైనా దుర్బుద్ధి.. పాక్ ఉగ్రవాదికి యూఎన్ లో మద్దతు

Published Date - 01:54 PM, Fri - 17 June 22
By venugopal reddy
China-India: మరోసారి చైనా దుర్బుద్ధి.. పాక్ ఉగ్రవాదికి యూఎన్ లో మద్దతు

అవకాశం దొరికితే భారత్ ను ఎలా ఇరికించాలనే ఆలోచనతోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. మరోసారి తన భారత వ్యతిరేకతను బయటపెట్టింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డు పెట్టింది. యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ లో ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాక్ ఉగ్రవాద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘ గ్లోబల్ టెర్రరిస్ట్’గా గుర్తించాలని భారత్, యూఎస్ఏ చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్ తో అడ్డుకుంది.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్, 26/11 ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ హఫీస్ సయూద్ కు స్వయానా బామమరిది. యూఎన్ఓ లో  1267 ఐసిస్, ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింది మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగ గుర్తించాలని పెట్టిన ప్రతిపాదనలను చివరి నిమిషంలో చైనా నిలిపివేసింది. గతంలో కూడా చైానా పాకిస్తాన్ కు మద్దతుగా నిలచింది. పలువురు ఉగ్రవాదులను గ్లోబల్ టెర్రిరిస్టులుగా గుర్తించేందుకు అంగీకరించలేదు. ఐరాస శాశ్వత సభ్యదేశాలకు ఉండే వీటో అధికారంలో ఈ ప్రక్రియను అడ్డుకుంది.

గతంలో కూడా చైనా, పాక్ ఉగ్రవాది జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ విషయంలో కూడా ఇలానే చేసింది. అయితే నాలుగు సార్లు ప్రయత్నించిన తర్వాత మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించారు. 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, పుల్వామా దాడిలో ఇతను కీలకంగా వ్యవహరించాడు. గతంలో 2010లో యూఎస్ ట్రెజరీ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా పేర్కొంది. దీంతో యూఎస్ లో ఎలాంటి లావాదేవీలు నడపకుండా మక్కీని నిషేధించారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ మక్కీ గురించి సమాచారం అందించిన వారికి 2 మిలియన్ డాలర్ల రివార్డ్ అందిస్తామని ప్రకటించింది. అబ్దుల్ రెహ్మన్ మక్కీ ప్రస్తుతం లష్కరే తోయిబాలో విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, నిధుల సేకరణలో కీలకంగా వ్యహరిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Tags
  • abdul Rehman Makki
  • china
  • Global Terrorist
  • india
  • United Nations

RELATED ARTICLES

COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు

USCIRF: యూఎస్ మతస్వేచ్ఛ కమిషన్ కు భారత్ ఘాటు సమాధానం

Earthquake: చైనాలో మళ్లీ భూకంపం.. రెండు రోజుల్లో రెండో భూకంపం

COVID 19: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు.. 31 మరణాలు

Srilanka: కీలక నిర్ణయం.. భారతీయ వ్యాపారవేత్తలకు ఐదేళ్ల వీసా

తాజావార్తలు

  • TS Police Jobs: కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల తేదీలు ఖరారు..

  • Rohit Sharma: కరోనా నుంచి కోలుకున్న రోహిత్.. ప్రాక్టీస్ మొదలెట్టేశాడు

  • Minister Roja: ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకున్న మంత్రి రోజా

  • Harish Rao: డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన

  • Miyazaki Mangoes: బాబోయ్.. రెండు మామిడి చెట్లకు అంత సెక్యురిటీనా.?

ట్రెండింగ్‌

  • Femina Miss India 2022: మిస్ ఇండియాగా సినిశెట్టి

  • Interesting Facts: ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారిని ఎందుకు దూరంగా ఉంచుతారు?

  • Kolkata: పెంపుడు కుక్క సాహసం.. దొంగ నుంచి కుటుంబాన్ని కాపాడిన వైనం

  • Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions