చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పాలన తీరుపై మండిపడ్డారు. కుప్పం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను..రాష్ట్రపతిని కలిశాను. ఏపీలో పరిస్థితులను వివరించాను ఏపీలో రాష్ట్ర ప్రేరేపిత తీవ్రవాదం నడుస్తోంది. ఏపీని పరిపాలించే అర్హత వైసీపీకి లేదు. పేదప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయంగా ముందుకు సాగిన పార్టీ తెలుగుదేశం అన్నారు చంద్రబాబు.
పోలీసు వ్యవస్థ సహకారంతో టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ ఆఫీసుపై డీజీపీ దాడి చేయించారు. కుప్పంలో పోలీసులు ఎక్కడ..? చోటా మోటా వైసీపీ నాయకులొస్తే భారీ భద్రత..ప్రతిపక్షనేత వస్తే పోలీసులు రారు..? నాపై బాంబులు వేస్తానని ఒక వైసీపీ నేత చెప్పాడు. అలిపిరిలో 24క్లైమోర్ మెన్స్ నన్ను ఏమీ చేయలేకపోయింది. నన్ను ప్రజలే కాపాడుకుంటారన్నారు. గంజాయికి కేరాఫ్ విజయవాడ మారిందని ఆరోపించారు. ఏపీ నుంచే గంజాయి సరఫరా వివిధ రాష్ట్రాలకు యథేచ్ఛగా సాగుతోంది. ప్రత్యేక హోదా తీసుకురాలేని జగన్ కొత్త మద్యం బ్రాండ్ లను తెస్తున్నాడు. మద్యపాన నిషేధానికి కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు.
ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. కోవిడ్ లో కర్ఫూ ఉన్నా మద్యం షాపులు బార్లా తెరిచారు. 25సంవత్సరాలు మద్యపాన నిషేధం చేసే అవకాశమే లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆదాయం కోసం అక్రమమార్గాలు తొక్కుతున్నారు. ఏపీలో దొంగసారా తయారవుతోంది. గంజాయి, హెరాయిన్ విచ్చలవిడి వాడకం జరుగుతోంది. ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుద్దాం. యువత భవిష్యత్తును కాపాడుకుందాం. పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే బాంబు లేస్తారా? పెద్దిరెడ్డి ఏమైనా పుడంగా? డీజీపీ అపీసులో పని చేసే వ్యక్తి కి టీడీపీ ఆఫీసులో పనేంటి?
రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో బూతులు మాట్లాడారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడుతున్నా అంటారు. నేను గట్టిగా మాట్లాడతాను కానీ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడను. రేషన్ కార్డులు ఇవ్వరు.. పెన్షన్ ఇవ్వరు. నిత్యావసర ధరలు పెరిగిన కనీసం స్పందించరు . ఇక పెట్రోల్ డీజిల్ ధరల గురించి చెప్పేది లేదు అంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు.