కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. అయితే సోమవారం నుంచి అన్నిశాఖలకు చెందిన వారు కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని కేంద్రం పేర్కొంది.
Read Also: వైరల్: ఇండియాలో తొలి బ్లాక్ చెయిన్ వివాహం
కాగా ఈ విషయంపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన ప్రకటించారు. కరోనాపై పరిస్థితిని ఆదివారం సమీక్షించామని… దేశంలో కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గిందని… కేసుల సంఖ్య కూడా తగ్గిందని తెలిపారు. దీంతో ఉద్యోగులందరూ కార్యాలయాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.