ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె కేసుకి సంబంధించి హైకోర్టు నియమించిన అప్పిలేట్ అథారిటీ ఊరట కలిగించింది. ఆమె ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది. ఆమెది ఎస్టీకి చెందిన కొండదొర సామాజికవర్గమని పేర్కొంది. దీంతో ఆమెకు పెద్ద ఊరట లభించినట్టయింది.. పుష్ప శ్రీవాణి గిరిజన మంత్రిగా వున్న సంగతి తెలిసిందే. ఆమె ఎస్టీ కాదని హైకోర్టులో రేగు మహేశ్వరరావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్ట్ విచారణ జరిపింది. ఏపీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీలేట్ అథారిటీ ద్వారా విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం ఆమె ఎస్టీ అని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.