దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగే వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నెట్ ప్రాక్టీసులో రోహిత్‌కు తొడ కండరాల గాయమైంది. దీంతో అతను సఫారీ పర్యటనకు దూరమయ్యాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కోలుకున్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి 6న తొలి వన్డే, ఫిబ్రవరి 9న రెండో వన్డే, ఫిబ్రవరి 11న మూడో వన్డే జరగనున్నాయి. ఈ వన్డే మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్ స్టేడియంలోనే జరగనున్నాయి. వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉ.9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. అటు ఫిబ్రవరి 16న తొలి టీ20, ఫిబ్రవరి 18న రెండో టీ20, ఫిబ్రవరి 20న మూడో టీ20 జరగనున్నాయి. టీ20 మ్యాచ్‌లన్నీ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతాయని బీసీసీఐ వెల్లడించింది. టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.