Bandi Sanjay: బీజేపీ ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువు అయ్యిందన్నారు. యూపీలో ఏడు స్థానాలలో ముందంజలో ఉందని తెలిపారు. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమి నే మహారాష్ట్ర ప్రజలు నమ్మారన్నారు. మహారాష్ట్ర లో హిందూ సమాజం ఐకమత్యాన్ని చాటారని తెలిపారు. బటేంగే తో కటెంగే అని చాటారన్నారు. సమాజం ఐక్యంగా ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయన్నారు. కర్ణాటక, తెలంగాణ నుండి మహారాష్ట్ర కి కాంగ్రెస్ డబ్బులు పంపిందని తెలిపారు.
Read also: Nayantara : రెస్టారెంట్లో 30నిమిషాలు వెయిటింగ్.. అయినా నయనతారను పట్టించుకోని జనం
మహారాష్ట్ర, తెలంగాణ లో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్ర లో గెలుపు వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందిందని తెలిపారు. మోడీ అభివృద్ధి మంత్రం పనిచేసిందన్నారు. బూత్ కి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మా కార్యకర్తల ముందు పనిచేయలేదన్నారు. ఇండియా కూటమి చీలీపోవడం ఖాయమని తెలిపారు. తెలంగాణ లో కూడా కాంగ్రెస్ కి ఇదే గతి పడుతుందన్నారు. మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ మోసాలని మేము ప్రచారం చేసామన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవెర్చండి..లేదంటే మహారాష్ట్ర లో పట్టిన గతే పడుతుందని పేర్కొన్నారు.
Read also: Maharashtra Next CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్: బీజేపీ
ఇచ్చింది ముఫ్ఫై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు..చెప్పింది మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారన్నారు. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారన్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ట్యాపరింగ్ చేసారా అన్నారు. మహారాష్ట్ర ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ లో ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణ లో యుద్ధం ప్రారంభం అయ్యిందన్నారు. ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అవుతాయన్నారు. ప్రభుత్వం కూలాలని మేము అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు,మంత్రులలో ప్రభుత్వం పై అసంతృప్తి ఉందన్నారు. కులగణన వివరాలు పెన్సిల్ తో నింపుతున్నారు.. వాటిని మార్చే అవకాశం ఉందన్నారు. కులగణన లో భయపెట్టి సర్వే చేస్తున్నారన్నారని తెలిపారు.
Maharashtra Election Results: వెనుకంజలో ఆదిత్య ఠాక్రే..