తెలంగాణలో బలపడేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. రాబోయే రెండేళ్ళు కష్టపడి పనిచేద్దాం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ అనుబంధ మోర్చాల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షించిన బండి సంజయ్ పలు సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’నిర్వహిస్తామన్నారు.
వచ్చే నెలలో నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల కల్పన కోసం ‘కోటి సంతకాల సేకరణ’చేపడతామన్నారు. జనం బీజేపీ పక్షాన ఉన్నారనే భయంతోనే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీ నుండి దాడులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం వుందని ఆయన క్యాడర్ కి తెలిపారు. అయినా భయపడే ప్రసక్తి లేదు… జనం పక్షాన ఉంటూ ధైర్యంగా ఎదుర్కొందాం అని సూచించారు.
రాబోయే రెండేళ్లు జనంలోనే ఉందాం…. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కష్టపడి పనిచేద్దాం అన్నారు బండి సంజయ్. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మోర్చాలు ఉద్యమించాలన్నారు ఎంపీ బండి సంజయ్.