సీఎం కేసీఆర్ డిప్రెషన్‌లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండలో బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ పై టీఆర్‌ఎస్ గుండాలు, పోలీసులు కలిసి దాడి చేశారని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు పాలించడానికి ఎన్నుకున్నారా గుండాయిజం చేయడానికి ఎన్నుకున్నారా ..? అంటూ ప్రశ్నించారు. యువమోర్చా కార్యకర్తపై కత్తులతో దాడి చేశారు.
Read Also: కేసీఆర్ అవమానంతో తలదించుకోవాలి: షర్మిల
డీజీపీకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు….. హోం గార్డును బదిలీ చేసే అధికారం కూడా డీజీపీకీ లేదు. సీపీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది… సీఎం కేసీఆర్ అలాంటి వాతావరణం సృష్టించారని బండి సంజయ్ అన్నారు. ఖమ్మం జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం.. ఇప్పుడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ తెచ్చిన బంగారు తెలంగాణ ఇదేనా అంటూ దుయ్యబట్టారు. 317 జీవోను సవరించాలని వేలాది మంది ఉద్యోగులతో జాతీయ నాయకులతో వర్చువల్ కార్యక్రమం చేపట్టబోతున్నాం. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు. ఈఎస్‌ఐ స్కాంలో అవినీతికి పాల్పడలేదని కేసీఆర్ చెప్పగలరా.. అవినీతి చిట్టా అంతా తీశాం.. కేసీఆర్ జైలుకు వెళ్లేది ఆయనకు తెలుసు ..మాకు తెలుసు అంటూ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.