ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అధికారులు అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ బిగ్‌బాష్ టోర్నీలో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే మెల్‌బోర్న్ జట్టులో 12 మంది కరోనా బారిన పడగా ఇప్పుడు మ్యాక్స్‌వెల్ 13వ వాడు కావడం గమనార్హం. ఆ జట్టులో 8 మంది సహాయక సిబ్బంది, నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే బిగ్‌బాష్ టోర్నీలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో టోర్నీని నిర్వాహకులు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: కరోనా థర్డ్ వేవ్.. వారంలో 400 శాతం పెరిగిన కరోనా కేసులు
మరోవైపు టీమిండియా క్రికెట్‌ను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. ఇటీవల గంగూలీ కరోనా బారిన పడి పూర్తిగా కోలుకోగా… తాజాగా గంగూలీ కుమార్తె సనకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే గంగూలీ భార్య డోనా కూడా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ అని తేలింది. ప్రస్తుతం గంగూలీ కుమార్తె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అటు దేశంలోని అన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు వేల సంఖ్యలో వస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలలో లాక్‌డౌన్ విధించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.