ఏపీ ప్రభుత్వంపై జరిగిన చర్చలపై ఉద్యోగులు హ్యాపీగా వున్నారన్నారు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి. ఫిట్ మెంట్ తప్ప మిగిలిన డిమాండ్లు మాకు సానుకూలంగా నే ప్రభుత్వం స్పందించింది. పదేళ్ల పీఆర్సీ బదులు ఐదేళ్ల పీఆర్సీని మేం సాధించుకున్నాం. హెచ్ ఆర్ ఎ శ్లాబుల్లో తెలంగాణతో సమానంగా సాధించుకున్నాం.
మా నుంచి రూ.5400 కోట్లు రికవరీని ప్రభుత్వం ఆపేసింది. నిన్నటి చర్చల్లో ఏడాదికి 1500 కోట్లు అదనంగా ప్రభుత్వం నుంచి రాబట్టాం. సీఎంది చాలా పెద్ద చేయి..మేము ఏదైనా అడిగితే ఏదీ కాదనరు. మేము ఆవేశంలో మాట్లాడినందుకు సీఎంకు క్షమాపణలు చెబుతున్నాం. ఇలాంటి పరిస్ధితుల్లో ఇరువర్గాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి..ఉద్యోగులు అర్ధం చేసుకోవాలి. మొత్తం ఎపిసోడ్ లో ఉద్యోగులు విజయం సాధించారన్నారు వెంకట్రామిరెడ్డి.
ఇదిలా వుంటే ఏపీటీఎఫ్ మాత్రం వ్యతిరేకతతో వుంది. ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలమయ్యాయి. ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాడతాం. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదన్నారు ఏపీటీఎఫ్. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కార్యాచరణ ప్రకటిస్తాం. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తీవ్రంగా విభేదించాం. పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలి. ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం స్పందించట్లేదన్నారు ఏపీటీఎఫ్ నేతలు.