ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా అదుపులో వుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.సంక్రాంతి శెలవుల తర్వాత స్కూళ్లు రీ-ఓపెన్ అయ్యాయి. ఎంత మంది వచ్చారనే అటెండెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్నాం అన్నారు.
గత రెండేళ్లల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయాం.విద్యార్ధుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇస్తున్నాం.సుమారు 22 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ వేసేశాం.విద్యార్ధులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తైంది.టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ వేశాం.ఎకడమిక్ ఇయరుని ముందుగా నిర్ణయుంచుకున్న ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయం.విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు.
కరోనా వ్యాక్సిన్ పూర్తి కాలేదని.. పాఠశాలలను తెరవొద్దంటూ ప్రతిపక్షాలు కామెంట్లు చేయడం విచారకరం. కరోనా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం. పొరుగు రాష్ట్రాలతో పోలిక అనవసరం.. గతంలో ఇతర రాష్ట్రాల కంటే.ముందుగానే స్కూళ్లను ఆగస్టులోనే ప్రారంభించాం.పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పెట్టలేకపోయినా.. ఏపీలో పెట్టాం.ఏపీలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహిస్తున్నాం.కమిషనరేట్లల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నాం.విరివిగా ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహిస్తాం.పేరెంట్స్ అనుమతితోనే స్కూళ్లను రీ-ఓపెన్ చేశాం.
ఆన్ లైన్ బోధన ఒక లెవల్ వరకే పరిమితం.క్లాసులకు ఫిజికలుగా వెళ్లడానికి ఆన్ లైన్ విద్యా బోధన ప్రత్యామ్నాయం కాదు.స్కూళ్లు తెరవడానికి.. కరోనా వ్యాప్తికి సంబంధమే లేదని నిబంధనలే చెబుతున్నాయి.స్కూళ్లల్లో కరోనా కేసులు ట్రేస్ అయితే.. శానిటైజ్ చేస్తున్నాం అని వివరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.