ఏపీలో రాజకీయ విమర్శల వేడి రాజుకుంటూనే వుంది. మంత్రులు టీడీపీ నేతలపై తమదైన రీతిలో మండిపడుతూనే వున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోంది. ముఖ్యమంత్రిని తీవ్రవాదిలాగా తయారు అయ్యారంటారు. క్విట్ జగన్ అంటాడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలేనా అవి?? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నారు మంత్రి అంబటి రాంబాబు.
బొబ్బిలి సినిమా గుర్తుకు తెచ్చుకుని ఆవేశం తెచ్చుకోండి అంటున్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చంద్రబాబు చేసిన మోసం అర్ధమై ప్రజలు చెప్పులు తీసుకుని కొడతారు. చంద్రబాబును బట్టలు ఊడదీసి ప్రజలు కొడతారు. ఆగష్టు లో నెల్లూరు బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు.
డయాఫ్రమ్ వాల్ పై చంద్రబాబు చర్చకు సిద్ధమా? చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి. ప్రజలు తిరగబడటం వల్లే లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడన్నారు అంబటి. స్వయంగా చంద్రబాబు తోడల్లుడే ఓ పుస్తకంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తాడని రాశారన్నారు.
Vizag High Alert: విశాఖలో హై అలర్ట్… హింసకు పాల్పడితే కఠినచర్యలు