నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2’ విడుదలపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఈ సినిమాకు సంబంధించిన వివాదంపై నిన్న రాత్రి 14 రీల్స్ సంస్థ మరియు ఈరోస్ సంస్థల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చర్చల ఫలితంగా, ఈరోజు (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు మద్రాస్ కోర్టులో జరగబోయే విచారణలో ఈ విషయాన్ని తెలియజేసి, సినిమా విడుదలకు అధికారిక అనుమతులు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు . వివాదం సద్దుమణగడంతో, ‘అఖండ-2’ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది. విడుదల తేదీ ఖరారైన నేపథ్యంలో, ఒకరోజు ముందుగానే అంటే 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ ఎనర్జీ, బోయపాటి మాస్ యాక్షన్ మళ్లీ తెరపై చూడాలని ఉవ్విళ్ళూరుతున్న అభిమానులకు ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్. కోర్టు నుంచి అధికారిక ప్రకటన రాగానే ‘అఖండ-2’ మాస్ జాతర మొదలవుతుంది.