ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల కార్యక్రమం ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్తుండగా.. కాల్పులకు తెగబడ్డారు.. మీరట్‌లోని (ఉత్తరప్రదేశ్‌లోని) కితౌర్‌లో ఎన్నికల సంబంధిత కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తున్నాను.. కానీ, ఛిజర్సీ టోల్ పాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు దుండగులు పాల్గొన్నట్టు పేర్కొన్న ఆయన.. తాను ప్రయాణిస్తున్న కారుపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు.. కాల్పుల తర్వాత తుపాకులు ఘటనా స్థలంలోనే వదిలి దుండుగులు పారిపోయినట్టు వెల్లడించారు.. తన కారుకు బుల్లెట్లు తగిలిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.. తన కారు పంక్చర్ కావడంతో, మరో కారులో తాను ఢిల్లీకి చేరుకున్నానని.. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదని.. అందరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు..
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022