కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పలువురు అధికారుల ఇళ్లపై మూకూమ్మడి సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఒకేసారి 80 ప్రాంతాల్లో 21మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలను ముమ్మరం చేశారు.
Agnipath: గుడ్‌న్యూస్.. ‘అగ్నిపథ్’ సర్వీస్‌కు అర్హత వయసు పెంచిన కేంద్రం
ఈ దాడుల్లో దాదాపు 300 మంది అధికారులు పాల్గొన్నారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 21 మంది అధికారులకు సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే వారి ఇళ్లపై సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఈ దాడులు చేపట్టామన్నారు. అధికారుల్లో ఆర్టీఓ, సీఐ, పీడబ్ల్యూడీ ఇంజినీర్లు, రిజిస్ట్రేషన్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.