మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ నిర్వహించే కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు చేసి ఘనంగా చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ వివాహానికి ఇండియా నుంచి తన బంధువులే కాకుండా.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరైనట్లు ఈడీ తెలిపింది. దీంతో ఇప్పుడు వారిని ఈడీ అధికారులు విచారణకు పిలవనున్నట్లు సమాచారం. పెళ్లికి హాజరైన వారిలో.. టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, గాయని నేహా కక్కర్ పేర్లు వినపడుతున్నాయి.
NIA Raids: ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ..
ఇదిలా ఉంటే.. దుబాయ్ నుండి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్‌ను నడుపుతున్న సౌరభ్ చంద్రకర్, అతని వ్యాపార భాగస్వామి రవి ఉప్పల్‌పై రూ.5,000 కోట్ల మనీలాండరింగ్ అభియోగంపై ఈడీ దర్యాప్తు చేస్తుండగా ఈ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మరోవైపు మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్‌తో బాలీవుడ్ కు కనెక్షన్ ఉన్నట్లు ఈడీ చెబుతుంది.
వివరాల్లోకి వెళ్తే.. మనీలాండరింగ్ కేసులో సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ కోసం ఈడీ అధికారులు వెతుకుతున్నారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు. అయితే.. చంద్రకర్ 2022 సెప్టెంబర్ 18న దుబాయ్‌లో ఓ పార్టీ ఇచ్చాడు. సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్లో జరిగిన ఆ పార్టీకి హాజరయ్యేందుకు కొంతమంది బాలీవుడ్ స్టార్లకు రూ.40 కోట్లు చెల్లించారు. అంతేకాకుండా.. ఫిబ్రవరిలో జరిగిన పెళ్లిలో నాగ్‌పూర్ నుండి కుటుంబ సభ్యులను దుబాయ్‌కి తీసుకెళ్లడానికి ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకున్నారు. వారితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, వెడ్డింగ్ ప్లానర్లు, డ్యాన్సర్లు, డెకరేటర్లు కూడా వెళ్లారు.
Amit Shah: లాలూ, నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు.. దర్భంగా ఎయిమ్స్ పనులపై ఫైర్
ఓ నివేదిక ప్రకారం.. అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బండా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్ తదితరులు ఉన్నట్లు తెలిపారు. అయితే గత ఏడాది డిసెంబర్లో మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్‌పై విచారణ ప్రారంభం కాగా.. ఇప్పుడు బాలీవుడ్ కనెక్షన్ తెరపైకి వచ్చింది. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ అనేది గత సంవత్సరంలో దాదాపు మిలియన్ మంది వ్యక్తులు బెట్టింగ్‌లు వేసిన గేమ్ యాప్. దాదాపు 30 కేంద్రాల నుంచి ఈ యాప్‌ను నిర్వహిస్తున్నారు. కానీ ప్రమోటర్లు మాత్రం దుబాయ్‌లో ఉన్నారు.
మరోవైపు మహాదేవ్ ఆన్లైన్ బుక్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబ్ వీడియోలలో కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఈ యాప్ యొక్క ప్రకటనలలో కనిపించిన బాలీవుడ్ ప్రముఖుల పేర్లను ఈడీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఒక ప్రముఖ హాస్య, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక టాప్ B-రంగ్ మేల్ స్టార్, ఒక మహిళా కామిక్ స్టార్ యాప్ యాజమాన్యం నుండి పేమెంట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. భోపాల్, ముంబై, కోల్‌కతాలో ఈ కేసుకు సంబంధించి రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ బెట్టింగ్ యాప్ ను ఇండియాలో వివిధ పేర్లతో నిర్వహిస్తున్నట్లు ఈడీ తెలిపింది.