కడియం శ్రీ హరి మరియు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని కడియం శ్రీ హరి అన్నారు. అయితే… దీనికి కౌంటర్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని.. కేసీఆర్ తాను ఎలాంటి వరాలు అడిగినా ఇస్తారని పేర్కొన్నారు.
అయితే… తాజాగా కడియం శ్రీ హరి మరియు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గీయుల మధ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. చిల్పూర్ మండలం లింగంపల్లి లో కడియం దిష్టిబొమ్మను కొందరు వ్యక్తులు దహనం చేశారు. అది రాజయ్య వర్గీయుల పనే అని కడియం వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. లింగంపల్లి రిజర్వాయర్ త్వరగా పూర్తి చేయాలని నిన్న దేవాదుల రివ్యూ మీటింగ్ లో కడియం శ్రీహరి పేర్కొన్నారు. లింగం పల్లి రిజర్వాయర్ కడితే.. తమ గ్రామం మునుగిపోతుందని కడియం దిష్టిబొమ్మను దహనం చేశారు.