నిన్న వరుడు అలా.. నేడు వధువు ఇలా…

వివాహం జరిగి 24 గంటలు కాకముందే ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భర్తతో కలిసి పుట్టింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం నాడు వరుడు మృతి చెందగా.. గురువారం నాడు వధువు ప్రాణం కోల్పోయింది. దీంతో పెళ్లి జరిగిన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. వివరాల్లో వెళ్తే… హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళికి ఇటీవల తిరుపతిలో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.

Read Also: ఆ చిన్న పని చేస్తే చాలు రూ. 9 లక్షల జీతం మీదే

వివాహం జరిగిన కొద్ది గంటల తర్వాత వధూవరులు హైదరాబాద్ వచ్చారు. అనంతరం వధువు సొంత ఊరైన చెన్నైకు భార్యాభర్తలు వెళ్తుండగా బెంగళూరు సమీపంలో సంభవించిన రోడ్డుప్రమాదంలో తొలుత వరుడు శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా… కోమాలోకి వెళ్లిన వధువు కనిమొళి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించింది. దీంతో పెళ్లయిన 24 గంటలకే వధూవరులిద్దరూ ప్రాణాలు పోగొట్టుకోవడంతో వారి కుటుంబాలు పుట్టెడు విషాదంలో మునిగిపోయాయి.

Related Articles

Latest Articles