కాన్పూర్ టెస్ట్: 45 ఓవర్లు.. 176 పరుగులు.. కివీస్ లెక్క ఇదే..!!

కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు న్యూజిలాండ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ ముందు 284 పరుగుల టార్గెట్‌ను భారత్ విధించింది. లక్ష్యఛేదనలో నాలుగోరోజే ఓ వికెట్ కోల్పోయిన కివీస్‌ను ఐదోరోజు భారత బౌలర్లు సులభంగానే చుట్టేస్తారని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పోరాట పటిమను చూపుతూ లక్ష్యం వైపుకు దూసుకువెళ్తున్నారు.

Read Also: టికెట్ రేట్లపై నాని కౌంటర్

ఐదో రోజు తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడిన న్యూజిలాండ్ లంచ్ తర్వాత వెంటనే ఓ వికెట్ కోల్పోయింది. సోమర్‌విల్లే 36 పరుగులు చేసి ఉమేష్ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విలియమ్సన్ నిలకడగా ఆడుతున్నాడు. మరోవైపు ఓపెనర్ లాథమ్ (52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డ్రింక్స్ విరామానికి న్యూజిలాండ్ స్కోరు 108/2. ఆ జట్టు గెలవాలంటే 45 ఓవర్లలో 176 పరుగులు చేస్తే చాలు. చూడటానికి ఈ లక్ష్యం తేలికగానే కనిపిస్తోంది. మరి భారత బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ టెస్టు గెలిస్తే టీమిండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ముందడుగు వేస్తుంది.

Related Articles

Latest Articles