పురిటినొప్పులతో సైకిల్‌పై ఆస్పత్రికి మహిళా ఎంపీ..

ఆమె ఓ ఎంపీ.. పైగా గర్భవతి.. అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి.. దీంతో.. వెనుకా ముందు ఆలోచించకుండా వెంటనే ఇంట్లో ఉన్న సైకిల్‌ ఎక్కి ఆస్పత్రికి వెళ్లింది.. ఆ తర్వాత పురిటినొప్పులు తీవ్రమయ్యాయి.. వెంటనే ఆమెకు డెలివరీ చేశారు వైద్యులు.. పండంటి బిడ్డకు ఆ మహిళా ఎంపీ జన్మనిచ్చింది.. ఇది ఏ సినిమా స్టోరీయో కాదు.. న్యూజిలాండ్‌లో జరిగిన యదార్థ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్ ఎంపీ జూలీ అన్నే జెంటర్ నిండు గర్భవతి.. ఆమెకు ఇవాళ తెల్లవారుజామున 2 గంటల సమయంలో పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయట.. వెంటనే ఆమె ఇంట్లో ఉన్న బైక్‌ వంటి సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లారు.. ఇక, ఆస్పత్రిలో చేరిన 10 నిమిషాలకే పురిటి నొప్పులు మరింత తీవ్రం కావడంతో.. వైద్యులు వెంటనే ఆమెను లేబర్ రూమ్‌కు తరలించి డెలివరీ చేశారు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు ఎంపీ జూలీ అన్నే జెంటర్.. తర్వాత ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. వైరల్‌గా మారిపోయింది.

ఇక, ఘటనపై తన ఫేస్‌బుక్‌ పేజీలో పంచుకున్నారు ఎంపీ జూలీ అన్నే జెంటర్‌.. ఆమె సాధారణంగా బైక్‌కు బదులు పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్‌ వాడుతూ వస్తున్నారు.. బైక్‌లా కనిపించే సైకిల్‌ను వాడతారు.. కానీ, చివరకు ఆస్పత్రికి కూడా ఆమె సైకిల్‌పైనే వెళ్లారు. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ.. పురిటినొప్పులతో సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లాలని మాత్రం తాను ప్లాన్‌ చేయలేదని తెలిపారు.. అదంతా అకస్మాత్తుగా జరిగిపోయిందన్నారు.. అయితే, తాను సైకిల్‌పై ఆస్పత్రికి బయల్దేరిన అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెద్దగా పురిటి నొప్పులు లేవని కానీ, ఆస్పత్రిలో చేరిన పది నిమిషాల తర్వాత నొప్పులు అధికమయ్యాయని.. మొత్తంగా ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత, తను రెండో బిడ్డకు జన్మనిచ్చానని.. మా కుటుంబంలోని సరికొత్త సభ్యుడిని తెల్లవారుజామున 3:04 గంటలకు స్వాగతించామని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.. మొత్తంగా మహిళా ఎంపీ.. నిండు గర్భిణిగా చేసిన ఈ సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

Latest Articles