ఢిల్లీని వ‌ణికిస్తున్న కొత్త వేరియంట్‌…

ఢిల్లీలో రోజు రోజుకు క‌రోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూతో పాటుగా విద్యాసంస్థ‌లు, పార్కులు, సినిమా థియేట‌ర్లు, జిమ్‌, స్పాలు మూసివేశారు.  50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్, మెట్రోలు కొన‌సాగుతున్నాయి.  ఇక‌, కార్యాల‌యాలు 50 శాతం సిబ్బందితో న‌డుస్తున్నాయి.   జ‌న‌వ‌రి 3 వ తేదీన 4099 పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌డంతో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది.  పాజిటివిటీ రేటు 6.46శాతంగా ఉన్న‌ది.  

Read: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్

డిసెంబ‌ర్ 30,31 తేదీల్లో న‌మోదైన క‌రోనా కేసుల్లో 84శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్న‌ట్టుగా జీనోమ్ సీక్వెన్సింగ్ లో బ‌య‌ట‌ప‌డిన‌ట్టు ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. పాజిటివిటీ రేటు 5 శాతానికి మించి రెండు రోజులు వ‌ర‌స‌గా న‌మోదైతే రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.  జ‌న‌వ‌రి 3 వ తేదీన రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.46శాతం గా ఉంది.  ఈరోజు రిలీజ్ చేసే బులిటెన్  వ‌చ్చిన త‌రువాత ఢిల్లీ ప్ర‌భుత్వం రెడ్ అల‌ర్ట్ పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles