సైబర్ నేరగాళ్ళ కొత్త తరహా మోసం…

సైబర్ నేరగాళ్ళ కొత్త తరహా మోసం బయట పడ్డింది. సంస్థల వెబ్ సైట్ లో సిఈఓ మెయిల్ పేరుతో నకిలీ మెయిల్ తయారు చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్ పంపించారు. తాను మీటింగ్ లో ఉన్నానని.. అత్యవసరంగా 10 వేల రూపాలయల యామెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపాలని క్రింది స్థాయి ఉద్యోగులకు మెయిల్ పంపారు. నిజమే అనుకుని గిఫ్ట్ కార్డ్ పంపారు నిజామాబాద్ గనుల శాఖ అధికారి. ఇలా మరో ఇద్దరు కూడా పంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఆ శాఖ డైరెక్టర్ రోనాల్డ్ రోస్ ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-