విజయ్ సేతుపతిపై దాడిలో కొత్త ట్విస్ట్.. తన్నిన వారికి రూ.1001 రివార్డ్.. ఎప్పటివరకంటే..?

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్టులో దాడికి పాల్పడిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఒక ఆగంతకుడు అమాంతంగా విజయ్ సేతుపతిపై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ సమయంలోనే విజయ్ సేతుపతిని తన్నిన వారికి ప్రతిసారీ రూ.1001 రివార్డ్‌గా చెల్లిస్తానని హిందూ మక్కల్ కట్చి నాయకుడైన అర్జున్ సంపత్ ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రముఖ స్వాతంత్య్రోద్యమ వీరుడు అయ్యి తేవర్ ను విజయ్ సేతుపతి అవమానించాడు. అందుకే అతనిని ఎవరైతే తన్నుతారో వారికి ప్రతిసారి రూ.1001 రివార్డ్‌గా చెల్లిస్తానని ట్వీట్ చేశాడు.

విజయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పేవరకు ఈ ఆఫర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా, బహిరంగంగా బెదిరింపులకు పాల్పడిన అర్జున్ సంపత్ పై తాజాగా కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 504, సెక్షన్ 506(1) కింద అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఈ విషయమై విజయ్ సేతుపతి సీరియస్ అయినా విషయం తెలిసిందే. ఆ దాడిని తాను సీరియస్ గా తీసుకోలేదని, దాని గురించి మీడియా పెద్దది చేసి రాయొద్దని విజయ్ సేతుపతి మండిపడ్డారు.

Related Articles

Latest Articles