విశాఖ బాలిక డెత్‌ కేసులో కొత్త ట్విస్ట్..!

విశాఖపట్నంలో మైనర్ బాలిక మృతి కేసులో సంచలనంగా మారింది.. అయితే, అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కుమార్తె పావని డెత్‌ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. రాత్రివేళ తల్లిదండ్రులు తనను ఒంటరిగా అబ్బాయితో చూస్తారన్న భయంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్న పక్క అపార్ట్‌మెంట్‌ 101లో ఉంటున్న యువకుడు నగేష్‌ను కలిసేందుకు బాలిక వెళ్లిందని.. ఇద్దరూ కలిసి మేడపైకి వెళ్లారని.. అయితే, నిద్ర లేచి చూసిన తండ్రికి కూతురు ఇంట్లో లేకపోవడంతో ఆందోళన గురికావడం.. ఈ లోపు పాప కోసం తల్లిదండ్రులు, బంధువులు వెతకడం.. లైట్లు వేసి పరిసర ప్రాంతాల్లో వెదకడాన్ని గమనించిన నగేష్‌ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. ఒంటరిగా పైనే ఉండిపోయిన బాలిక భయంతో పై నుండి దూకినట్లు పోలీసులు అనుమిస్తున్నారు. పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుండగా.. ఇప్పటికే నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. కొంత కాలంగా ఇరువురు మధ్య ప్రేమ వ్యవహరం నడుస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. విశాఖలో నగేష్ కాంట్రాక్ట్ పూర్తికావడంతో బాలిక కలిసేందుకు వెళ్లినట్టుగా చెబుతున్నారు.

-Advertisement-విశాఖ బాలిక డెత్‌ కేసులో కొత్త ట్విస్ట్..!

Related Articles

Latest Articles