లోన్ యాప్స్ కేసులో వెలుగులోకి కొత్త కోణం…

లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల నుంచి 300 కోట్ల రూపాయలు కొట్టేయాలని ప్లాన్ చేసారు.టైల్ బేసిక్ లో కలకత్తా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కోటి 18 లక్షల రూపాయలు డ్రా చేసారు నిర్వాహకులు. లోన్ యాప్ ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ చెందిన అనిల్ నల్లమోతు ద్వారా డబ్బులను డిపి చేసారు చైనా కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ పోలీసులు పేరుతో బ్యాంకులను బెదిరించిన అనిల్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసారు. ఢిల్లీలోని ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించిన అనిల్ గ్యాంగ్.. ఖాతాల నుంచి అక్రమంగా నగదు బదిలీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు.

సైబర్ నేరస్థుడు అనిల్ తో 25లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించిన పోలీసులు… విజయవాడ నుంచి కోల్ కతా వెళ్లేందుకు అనిల్ ఖాతాలో 20వేలు జమ చేసారు రుణయాప్ నిర్వాహకులు. నకిలీ ఎస్సై అవతారమెత్తి కోల్ కతా ఐసీఐసీఐ ఖాతాలో నుంచి 1.18కోట్లు బదిలీ చేసిన అనిల్… ఆనంద్ ఖాతాలో జమ చేసి ఆ తర్వాత ఆ నగదు పలు ఖాతాల్లోకి బదిలీ చేసాడు. ఆనంద్ కు 1.5లక్షలు ఇచ్చాడు అనిల్. అయితే అతనికి సూచనలిచ్చిన వ్యక్తి కోసం ఢిల్లీ వెళ్లారు సైబర్ క్రైం పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-