బీజేపీలో కొత్త ట్రెండ్.. యాక్షన్ తో వార్నింగ్..!

బీజేపీ జాతీయ నాయకత్వం.. కొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. గతంలో.. పద్ధతి.. పద్ధతి.. అని చెప్పినట్టుగా కాకుండా.. ఇక తేడా వస్తే.. తోక కట్ చేయడమే.. అన్నట్టుగా నిర్ణయాలు అమలు చేస్తోంది. కొంత కాలంగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు సైతం ఈ కోవకే చెందుతుంది. పార్టీ లైన్ కు ఏ మాత్రం భిన్నంగా ఉన్నా.. శ్రేణులను సమర్థంగా నడిపించలేకపోతున్నా.. అధిష్టానం ఏ మాత్రం కనికరించడం లేదు.

రాబోయే సార్వత్రిక ఎన్నికలే ధ్యేయంగా.. పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఉత్తరాదినే కాదు.. దక్షిణాదిపైనా ఫోకస్ చేస్తోంది. ఫైర్ బ్రాండ్ అయిన అమిత్ షా.. వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్రాలను సందర్శిస్తూ.. పార్టీ స్థానిక నాయకత్వాలకు క్లియర్ గైడ్ లైన్స్ ఇస్తున్న తీరును కూడా చూస్తున్నాం. త్వరలోనే.. ఆయన తెలంగాణలోనూ పర్యటించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం.. యూపీ నేతలతో భేటీ అయ్యారు.

ఇతర నేతలు గుజరాత్ పై ఫోకస్ పెట్టారు. ప్రధాని మోడీ.. ఢిల్లీ నుంచే మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. అమిత్ షా తో పాటు.. ఇతర వ్యూహకర్తలు.. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బీజేపీ నాయకత్వ అడుగులు చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లోనూ అవసరాన్ని బట్టి మార్పులు తప్పవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీతో పాటు.. తెలంగాణపైనా ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టడమే ఇందుకు కారణమవుతోంది.

ముఖ్యంగా.. తెలంగాణలో పార్టీకి ఇప్పుడున్న పాజిటివ్ వేవ్ ను కొనసాగించాలని తాపత్రయపడుతోంది. ఆంధ్రాలో టీడీపీని దాటి కనీసం రెండో స్థానానికైనా చేరుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. జనసేనతో కలిసి నడవడం ఇందుకే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో.. అటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లకు.. ముందు ముందు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతలు ఎలా ప్రవర్తిస్తారు.. పార్టీ లక్ష్యాలను ఎలా చేరుకుంటారు.. అన్నది ఆసక్తికరంగా మారింది. లక్ష్యాలు చేరుకోలేకపోతున్న నేతల విషయంలో.. బీజేపీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా.. చర్చల్లో భాగం పంచుకుంటోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-