కెన‌డాలో మ‌రో వింత‌వ్యాధి…అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం..

క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే.  కారోనా కార‌ణంగా ఇప్ప‌టికే లక్ష‌లాది మంది క‌రోనాతో మృతిచెందిన సంగ‌తి తెలిసిందే.  కోట్లాదిమందికి క‌రోనా సోకింది.  క‌రోనా సోకిన వ్యక్తులు మాన‌సికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దీంతో పాటుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్టు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, కెన‌డాలో ఇప్పుడు మ‌రో వింత వ్యాధి ప్ర‌భ‌లుతున్న‌ది.  నిద్ర‌లేమి, కండ‌రాల బ‌ల‌హీన‌త‌, బ్ర‌మ‌, పీడ‌క‌ల‌లు వంటి ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య అధికం అవుతున్న‌ది.  న్యూబ్ర‌న్స్ వీక్ ప్రావిన్స్ లో ఈ వ్యాధితో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య అధికం అవుతున్న‌ది.  ఈ లక్ష‌ణాల‌కు కార‌ణం ఎంటో తెలియ‌డంలేద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు.  మొబైల్‌ను అధికంగా వినియోగించ‌డం అని కొంద‌రు చెబుతుంటే, మ‌రికొంద‌రు మాత్రం క‌రోనా వ్యాక్సిన్ కార‌ణంగా ఇలా జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-