బుర్రపాడు చేస్తున్న ‘హీరో’ సాంగ్..

గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో హీరో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తుండగా.. రానా దగ్గుబాటి స్పెషల్ గెస్టుగా రానున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి ప్రజాదారణ చూరగొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాలోని మరో పాటను ప్రీ రిలీజ్ వేడుకపై రిలీజ్ చేశారు. బుర్రపాడవుతున్నదే అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకొంటుంది. అశోక్ మాస్ స్టెప్పులు, నిధి అగర్వాల్ క్లాస్ అందాలతో సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఈ సాంగ్ చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే మాస్ సాంగ్ లా కనిపిస్తోంది. గిబ్రాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి భాస్కర్ భట్ల లిరిక్స్ రాయగా.. అనురాహ్ కులకర్ణి , మంగ్లీ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles