సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : “తెలంగాణ దళిత బంధు” పేరుతో కొత్త పథకం

తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక వర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని అమలును ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంపిక చేశారు.

read also : కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ మరో లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-