ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: బెంగాల్‌లో కొత్త ఆంక్ష‌లు… నేటి నుంచి…

దేశంలో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు భ‌య‌పెడుతున్నాయి.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.  ఢిల్లీ, మ‌హారాష్ట్రాలో నైట్ క‌ర్ఫ్యూతో పాటు క‌ఠిన‌మైన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు.  ఇక తాజాగా, ప‌శ్చిమ బెంగాల్‌లోనూ క‌ఠిన‌మైన ఆంక్ష‌లు అమ‌లుకాబోతున్నాయి.  క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచి విద్యాసంస్థ‌లు, పార్కులు, జిమ్ లు, సెలూన్లు, బ్యూటీపార్ల‌ర్లు మూసివేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  50 శాతం ఉద్యోగుల‌తోనే కార్యాల‌యాలు న‌డ‌వ‌బోతున్నాయి.  లోక‌ల్ రైళ్లు సైతం 50 శాతం సీటింగ్‌తోనే న‌డుస్తాయి.  

Read: జ‌న‌వ‌రి 3, సోమ‌వారం దిన‌ఫ‌లాలు…

కోల్‌క‌తా నుంచి ముంబై, ఢిల్లీల‌కు మాత్ర‌మే విమాన స‌ర్వీసులు న‌డ‌పాల‌ని బెంగాల్‌స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.  వైరస్ క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు బెంగాల్ స‌ర్కార్ తెలియ‌జేసింది. అవ‌స‌ర‌మైతే నైట్ క‌ర్ఫ్యూతో పాటు ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తామ‌ని, థ‌ర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు స‌ర్కార్ సిద్ధంగా ఉన్న‌ట్టు బెంగాల్ ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  రాబోయే నాలుగు వారాలు కీల‌కం కావ‌డంతో వైద్య సిబ్బందిని ప్ర‌భుత్వం అల‌ర్ట్ చేసింది.  మాస్క్‌ను త‌ప్ప‌ని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

Related Articles

Latest Articles