క్లారిటీ రానున్న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)… ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయినా ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా వున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం.

ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి, లేదా సమ్మర్ లో వస్తుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో థియేటర్లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ సినిమాని క్రిస్మస్ సందర్బంగా తీసుకొచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారట. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో ఉన్న రాజమౌళి.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పనులు మొదలెట్టారట. సంక్రాంతికి, సమ్మర్ లోను పెద్ద సినిమాల లిస్ట్ బాగానే వుంటటంతో క్రిస్మస్ పండక్కి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇక క్రిస్మస్ కు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా రావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యంతో వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ హీరోయిన్లుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

-Advertisement-క్లారిటీ రానున్న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ!

Related Articles

Latest Articles