“కేజీఎఫ్-2” అప్డేట్… డేంజరస్ గా రాఖీభాయ్

కన్నడ స్టార్ యష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్-2” నుంచి అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ ఉన్న సినిమాలలో ‘కేజీఎఫ్’ సీక్వెల్ కూడా ఒకటి. కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Read Also : ‘కేజీఎఫ్’ స్టార్ అసలు పేరు తెలుసా?

తాజాగా యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో యష్ సీరియస్ గా కన్పిస్తుండగా, ఆయన ముందు “కాజన్, డేంజర్ ఎహెడ్” అనే బోర్డు కన్పిస్తోంది. మా రాఖీభాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ఈ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆయన అభిమానులకు మరో సంతోషకరమైన వార్త ఏమిటంటే ఈ పోస్టర్ లో సినిమా విడుదల తేదీని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. కరోనా పరిస్థితుల మధ్య సినిమా మళ్ళీ వాయిదా పడుతుందేమో అనే సందేహాలను ఈ పోస్టర్ తొలగించిందని చెప్పాలి.

Image

Related Articles

Latest Articles