‘పొన్నియిన్ సెల్వన్’ బ్రాండ్ న్యూ పోస్టర్!

కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తొలిభాగానికి సంబంధించిన నయా పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు.

‘స్వర్ణయుగం ప్రాణం పోసుకుంటోంది’ అనే కాప్షన్ పెట్టి ఈ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్ హౌస్, మద్రాస్ టాకీస్ ట్వీట్ చేశాయి. గాండ్రించే పులి తల ఉన్న డాలు, దాని ముందు ఓ ఖడ్గం ఉన్న పోస్టర్ ను విడుదల చేశాయి. ‘పి.ఎస్. 1’ 2022లో జనం ముందుకు వస్తుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాలకు రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-