నీటి పుక్కిలింతతో కరోనా నిర్ధారణ పరీక్ష !

కరోనా మొదలైనప్పటి నుంచి దాని నిర్ధారణ అనేక రకాలుగా టెస్టులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్, లేదా స్కానింగ్ పద్దతుల ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. అయితే పరీక్షలతో ఫలితాలు ఉన్నా అందరికీ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు ఆర్టీపీసీఆర్ టెస్టుల మీదనే ఆధారపడుతున్నారు. మరోవైపు ఈ కితల కొరత కూడా వేదిస్తోంది. ఇక స్కానింగ్ ద్వారా కేవలం పట్టణాల్లోనే వ్యాధి నిర్ధారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనాను నిర్ధారిచేందుకు మరో రకమైన విధానానికి నాగ్ పూర్ లోని కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్‌కు అనుబంధంగా ఉన్న నీరయి అనే సంస్థ దీన్ని అభివృద్ది చేసింది. నోటితో ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా కరోనా టెస్టు ను నిర్ధారణ చేస్తున్నారు. అయితే ఇది చాలా సులభంగా ఉంటుందని, 3 గంటల్లో వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ పరీక్షల కోసం ఐసీఎంఆర్ కూడా అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుణెలో ఈ రకమైన టెస్టులు చేస్తున్నట్లు నీరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-