కియా నుంచి మ‌రో న‌యా కార్‌… క‌రెన్స్‌…ఫీచ‌ర్స్ అదుర్స్‌..

కియా నుంచి మ‌రో కొత్త కారు రిలీజ్ కాబోతున్న‌ది.  ఇప్ప‌టికే మూడు కియా కార్లు ఇండియాలో రిలీజ్ కాగా, ఇప్పుడు నాలుగో కారును రిలీజ్ చేయ‌బోతున్నారు.  కియా క‌రెన్స్ అనే ప్రీమియం రేంజ్ కారును రిలీజ్ చేయ‌నున్నారు.  ఈనెల 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.  7 సీట్ల సామ‌ర్థ్యంతో రిలీజ్ కాబోతున్న క‌రెన్స్ 8 ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో అందుబాటులో ఉండ‌బోతున్న‌ట్టు కియా పేర్కొన్న‌ది.  కియా నుంచి ఇప్ప‌టికే సెల్టోస్‌, సొనెట్‌, కార్నివాల్‌తో పోలిస్తే క‌రెన్స్ డిజైన్ భిన్నంగా ఉన్న‌ట్టు కియా పేర్కొన్న‌ది.  ఎస్‌యూవీ త‌ర‌హాలో ఈ కారును రూపొందించారు.  

Read: ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి : జేపీ నడ్డా

కియాకే సొంత‌మైన టైగ‌ర్‌నోస్ గ్రిల్ డిజైన్ స్థానంలో కొత్త‌గా రేడియేట‌ర్ గ్రిల్‌లో క‌రెన్స్‌ను రూపొందించారు.  క్రోమ్‌ గార్నిష్డ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, ఇండికేటర్‌ ఇంటిగ్రేటెడ్‌ వింగ్‌ మిర్రర్‌, స్పోర్టీ అలాయ్‌ వీల్స్‌, చంకీ బ్లాక్ బంపర్ తో ఆక‌ర్ష‌ణీయంగా డిజైన్ చేశారు.  ఇవే హైలైట్‌గా నిలిచాయి.  1.5 లీటర్‌ స్మార్ట్‌స్ట్రీమ్‌ పెట్రోల్‌, 1.4 లీటర్‌ టీజీడీఐ స్మార్ట్‌స్ట్రీమ్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ సీఆర్‌డీఐ వీజీటీ డీజిల్‌ యూనిట్‌తో మొత్తం మూడు పవర్‌ట్రెయిన్లతో కియా కరెన్స్ ఉండ‌టం విశేషం.  అత్య‌ద్భుత‌మైన భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌తో కియా కారును రూపొందించారు.  

Related Articles

Latest Articles