ఇండియాను బ‌య‌పెడుతున్న మ‌రో వేరియంట్‌…సోకిన వారం రోజుల్లో…

సార్స్ కోవ్ 2 వైర‌స్ వివిధ ప్రాంతాల్లో వివిధ ర‌కాలుగా మార్పులు చెందుతూ భ‌యాంధోళ‌న‌ల‌కు గురిచేస్తున్న‌ది.  ఈ440కె, బ్రిట‌న్ వేరియంట్ లు ప్ర‌మాద‌మైన వాటిగా గుర్తించారు.  కాగా, ఇండియాలో వేగంగా విస్త‌రిస్తున్న బి. 1.617 వేరియంట్ కూడా ప్ర‌మాద‌మైన వేరియంట్ గా మారింది.  అయితే, ఇప్పుడు ఇండియాలో మ‌రో కొత్త వేరియంట్‌ను నిపుణులు క‌నుగొన్నారు.  బి.1.1.28.2 అనే వేరియంట్‌ను ఇటీవ‌లే ఇండియాలో గుర్తించారు.  మొద‌ట ఈ వేరియంట్ బ్రెజిల్‌లో వెలుగుచూసింది.  ఈ వేరియంట్ సోకిన సోకిన వారం రోజుల్లోనే ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి.  ఈ వేరియంట్ సోకిన వ్య‌క్తి వారంలో బ‌రువును కోల్పోతాడు. యాంటీబాడీల సామార్థ్యాన్ని కూడా ఈ వేరియంట్ త‌గ్గిస్తుంద‌ని, చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా చేర్చే అవ‌కాశం ఉంద‌ని పూణేలోని వైరాల‌జీ సంస్థ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  విదేశాల నుంచి వ‌చ్చిన ఇద్దరిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు.  దేశంలో ఈ వేరియంట్ కేసులు త‌క్కువ‌గా ఉన్నాయి.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-