‘రెడ్ నోటీస్’… నెట్ ఫ్లిక్స్ లోకి ‘ద రాక్’ రాకింగ్ ఎంట్రీ!

‘ద రాక్’గా ఫేమస్ అయిన డ్వైన్ జాన్సన్ తొలిసారి నెట్ ఫ్లిక్స్ లో కాలుమోపబోతున్నాడు. ‘రెడ్ నోటిస్’ పేరుతో ఆయన నటించిన సినిమా నవంబర్ లో స్ట్రీమింగ్ కానుంది. రాసన్ థండర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రయాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్ కీలక పాత్రలు పోషించారు.

Read Also : యూరోప్, అమెరికా తరువాత ఇండియాలోకి ‘ఎఫ్ 9’! ఆగస్ట్ 5న ‘రేసింగ్ బిగిన్స్’!

ద రాక్ స్వయంగా సొషల్ మీడియాలో ప్రకటించిన దాని ప్రకారం నవంబర్ 12న ‘రెడ్ నోటీస్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజు అభిమానులకి అందుబాటులోకి వస్తుంది. ఓ ఎఫ్ బీఐ ప్రొఫైలర్, ఒక మోస్ట్ వాంటెడ్ ఆర్ట్ థీఫ్, ఓ గ్రెటెస్ట్ కాన్ మ్యాన్ అంటూ జాన్సన్ ‘రెడ్ నోటిస్’ సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో కూడా హింట్ ఇచ్చాడు. తన కెరీర్ లో ‘రెడ్ నోటీస్’ ఫస్ట్ స్ట్రీమింగ్ మూవీ అంటూ… డిజిటల్ డెబ్యూని వీక్షించనున్న… 205 మిలియన్ మంది నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ కి ముందుగానే ‘థాంక్స్’ చెప్పాడు రాక్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-