నెట్ ఫ్లిక్స్.. సమంతకు గాలం!

లాక్ డౌన్ వల్ల విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ ,నెట్ ఫ్లిక్స్ , ఆహా వంటి ఓటీటీ సంస్థలు సినిమాలకు గాలం వేస్తున్నాయి. ఇదిలావుంటే, ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాతో కలిసి ‘సామ్ జామ్’ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సమంత అమెజాన్ ప్రైమ్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తోను ఆకట్టుకుంది. దీంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా సమంతతో ఏదైనా ప్రోగ్రాంతో గాని లేదా వెబ్ సిరీస్ అయిన ప్లాన్ చేసే ఆలోచనలో పడ్డారట. దీనికోసం సమంతకు భారీ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఇప్పటి వరకు సౌత్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో సరైన వెబ్ సిరీస్ రాలేదు. ఇప్పుడు సమంతకి భారీ రెమ్యూనరేషన్ తో డీల్ కుదుర్చుకొనే పనిలో పడ్డారట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-