త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తాం : నెల్లూరు ఆనందయ్య

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న సమయంలో.. ఆయుర్వేద మందు తయారీ చేసి వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య… ఆయన మందు కొంతకాలం ఆగిపోయిన… మొత్తానికి ఏపీ సర్కార్‌ అనుమతి ఇవ్వడంతో.. మంది పంపిణీ మొదలు పెట్టారాయన. ఈ సమయంలో ఆనందయ్యకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఇక తాజాగా రాజమండ్రిలో అఖిల భారత యాదవ మహాసభ 13 జిల్లాల సమైఖ్య సమావేశ యాత్ర సభ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఆనందయ్య వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… నా కరోనా మందు తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు అని నెల్లూరు ఆనందయ్య తెలిపారు. త్వరలో యాదవుల రాజకీయ పార్టీ ప్రారంభిస్తాం మిగిలిన బీసీ కులాలతో కలిసి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించాం అని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రధయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం అని ఆనందయ్య పేర్కొన్నారు.

-Advertisement-త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తాం : నెల్లూరు ఆనందయ్య

Related Articles

Latest Articles