‘లక్ష’ణమైన గాయనీ’మనీ’… నేహా కక్కర్!

ప్రస్తుతం బాలీవుడ్ లోని టాప్ సింగర్స్ లో యమ బిజీగా ఉండేది నేహా కక్కర్ మాత్రమే. ఆమె సినిమా పాటలతో పాటూ ప్రైవేట్ వీడియో సాంగ్స్ ద్వారా కూడా మ్యూజిక్ లవ్వర్స్ కి దగ్గరైంది. నేహా రియాల్టీ షో జడ్జ్ గా కూడా ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్. అయితే, ప్రజెంట్ మార్కెట్లో ఆమె నెట్ వర్త్ ఎంతో తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు!
నేహా కక్కర్ నెట్ వర్త్ 36 కోట్లట! ఓ వెబ్ పోర్టల్ లో వచ్చిన ఈ విషయం అధికారికం కాకపోయినా సొషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. సంవత్సరానికి 36 కోట్లకు పైగా సంపాదించే కక్కర్ నెలకు ముప్పై లక్షలకు తగ్గకుండా ఖాతాలో వేసుకుంటోందట! అంటే… ఆమె ఆదాయం రోజుకు ‘లక్ష’!
నేహ కక్కర్ బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గానే కాక ఈవెంట్స్, సెరిమనీస్ లో పాల్గొనటం, మ్యూజిక్ టీవీ షోస్ లో జడ్జ్ గా వ్యవహరించటం ద్వారా లక్షలు సంపాదిస్తోంది. అయితే, ఆమె టాలెంట్… ఆ టాలెంట్ కారణంగా సంపాదించుకున్న కోట్లాది అభిమానులు… ఆ అభిమానుల క్రేజీ ఫాలోయింగ్… ఇవన్నీ చూసినప్పుడు ఆమెకు అంతగా డబ్బులు ముట్టజెప్పటం తప్పు లేదనిపిస్తుంది. అంతే కాదు, నేహ క్కకర్ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ కూడా! ఆమెకున్న ఫాలోయింగ్ కి అందం కూడా ఓ కారణమే!
ఒక్కో సినిమా సాంగ్ పాడటానికి 8 నుంచీ 10 లక్షలు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే మిస్ కక్కర్ ఈ మధ్యే పెళ్లి చేసుకుని మిసెస్ నేహా అయింది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-