ఆరు కోట్ల ఫాలోయర్స్ తో అందాల గాయనీ అరుదైన రికార్డ్!

నేహా కక్కర్ మరోసారి సత్తా చాటింది! ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్టుగా మార్మోగే నేహా ఇన్ స్టాగ్రామ్ లో 60 మిలియన్ మార్క్ దాటింది. హైట్ విషయంలో దాదాపుగా అందరు సింగర్స్ కంటే పొట్టి అయిన అందాల గాయనీ… అభిమానుల ఫాలోయింగ్ విషయంలో మాత్రం అందనంత ఎత్తులో కొనసాగుతోంది! నేహా కక్కర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ విషయంలో ఇతర భారతీయ సంగీత ప్రముఖులందర్నీ దాటేసింది! 60 మిలియన్… అంటే 6 కోట్ల మందితో… అత్యధిక ఫాలోయర్స్ గల ఇండియన్ మ్యూజీషియన్ గా రికార్డ్ సృష్టించింది…

Read Also: 30 యేళ్ళ క్రితం హీరోయిన్… ఇప్పుడు మాజీ సీఎం భార్య!

నేహా కక్కర్ ఇన్ స్టాగ్రామ్ సంచలనంతో ఆమె భర్త రోహన్ ప్రీత్ ఓ సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చాడు! గది మొత్తం బెలూన్లతో అలంకరించి, నేహా చేత కేక్ కట్ చేయించాడు! నేహాతో పాటూ ఈ సెలబ్రేషన్ లో ఆమె ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయితే, తన కేక్ కటింగ్ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ‘ఇండియన్ ఐడల్’ రియాల్టీ షో జడ్జ్ అందరికీ ‘థాంక్స్’ చెప్పింది. ఫాలోయర్స్ తో ‘మీరు లేకుంటే నేహా లేదు’ అంటూ ఎమోషనల్ గా సందేశాన్ని పంచుకుంది. భర్త రోహన్ ప్రీత్ తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచీ ‘అన్ని విధాలుగా సంతోషరిచేందుకు’ ప్రయత్నిస్తున్నాడని నేహా అంటోంది. ఇక తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రోషిణీ, శ్రేయాను తన ‘థాంక్యూ’ మెసేజ్ లో ట్యాగ్ చేసింది నేహా కక్కర్.
నేహా కక్కర్ ప్రస్తుతం బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ లో నంబర్ వన్ గా కొనసాగుతోంది. అలాగే, వీడియో ఆల్బమ్స్ తోనూ అలరిస్తోంది. ఇండియన్ ఐడల్ రియాల్టీ షో జడ్జ్ కూడా నేహా ప్రేక్షకుల మనసులు దోచుకుంది…

View this post on Instagram

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-