మగబిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్

బాలీవుడ్ నటి నేహా ధూపియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నేహా భర్త, నటుడు అంగద్‌ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018 లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 లో ఈ దంపతులకి ఒక పాప పుట్టగా, ఇప్పుడు బాబు పుట్టాడు. ఇక ఈ బ్యూటీ తెలుగులో తరుణ్ నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. రాజశేఖర్ తో ‘విలన్’ సినిమాలో నటించింది. ‘పరమ వీర చక్ర’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించింది.

-Advertisement-మగబిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్

Related Articles

Latest Articles