బురిడీ బాబా బాగోతం.. మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడి.. సీఐ, ఎస్‌పై వేటు..

రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఓ బురిడీ బాబా అండ్ గ్యాంగ్ బాగోతం వెలుగుచూసింది.. రామన్నపేట మండ‌లం మునిపంపుల గ్రామంలో జ‌రిగిన దారుణ‌మైన ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఆ గ్రామానికి చెందిన దంపతుల గొడవల్లో తలదూర్చాడు బురిడీ బాబా.. సమస్య పరిష్కరిస్తామని పూజలు మొదలుపెట్టిన బాబా.. పూజల పేరుతో భాదితురాలిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.. ఆ ఘ‌ట‌న‌ను బాబా అనుచ‌రులు వీడియోతీశారు.. అనంతరం బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ అంద‌నికాడికి దండుకుంటూ వ‌చ్చింది న‌కిలీ బాబా గ్యాంగ్.. ఇలా బాధితురాలి దగ్గర లక్షల్లో వ‌సూలు చేశారు.. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో బాధిత మ‌హిళ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.. అయితే, కేసు నమోదు చేయకుండా సెటిల్ మెంట్ చేసిన పోలీసులు.. వీడియోలు డిలీట్ చేసి బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు ఇప్పించారు.. కానీ, మొత్తం డ‌బ్బు ఇవ్వ‌క‌పోడంతో… రాచకొండ పోలీస్ క‌మిష‌న‌ర్‌ను ఆశ్రయించారు బాధితురాలు. విచార‌ణ‌లో పోలీసులు, బాబాల బాగోతం బ‌య‌ట‌ప‌డింది.. కేసులో నిర్లక్ష్యం వహించిన రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ లను సస్పెండ్ చేసిన సీపీ.. ఇద్ద‌రు బురిడీ బాబాల‌ను అదుపులోకి తీసుకున్నారు.. మరో ముగ్గురి కోసం స్పెష‌ల్ పార్టీ పోలీసులు గాలిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-