సెప్టెంబర్ 12న నీట్

కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు అయితే.. మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చింది ప్రభుత్వం.. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడం వలన.. పరీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని వెల్లడించారు.. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని.. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1వ తేదీన నీట్ జరగాల్సి ఉన్నా.. కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది.. ఇక, పరీక్ష జరిగే పట్టణాల సంఖ్యను కూడా పెంచింది కేంద్రం.. గతంలో పరీక్ష జరిగే పట్టణాల సంఖ్య 155గా ఉండగా.. ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆ సంఖ్యను 198కి పెంచింది. ఇక, పరీక్ష కేంద్రాలలు కూడా పెరిగిపోయాయి..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-