ఆహాలో నయనతార ‘నీడ’!

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూతపడటంతో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ శుక్రవారం ‘నిళల్’ చిత్రాన్ని ‘నీడ’ పేరుతో అనువదించి, ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ గా కుంచకో బోబన్ నటించగా, ఎనిమిదేళ్ళ పిల్లాడి సింగిల్ మదర్ పాత్రను నయనతార పోషించింది. ఆమె పిల్లాడు స్కూల్లో ఖాళీ సమయంలో టీచర్ కు, తోటి విద్యార్థులకు క్రైమ్ స్టోరీలు చెబుతుంటాడు.

చిత్రం ఏమంటే… అవన్నీ నిజంగానే గతంలో జరిగి ఉంటాయి. ఈ విషయం మెజిస్ట్రేట్ దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ తల్లీకొడుకుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ‘నీడ’ చిత్రం. నయనతార, బోబన్ తో పాటు రోనీ డేవిడ్, సైజు కురుప్, లాల్, దివ్యప్రభ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నయనతార భర్తగా ఫహద్ ఫాజిల్ అతిథి పాత్రలో కనిపిస్తాడు. అప్పు కె భట్టతిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సూరజ్ ఎస్ కురుప్ నేపథ్య సంగీతం అందించాడు. గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో నయనతార నటించిన ‘అమ్మోరు తల్లి’ కూడా తెలుగువారి ముందుకు ఓటీటీలోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-