ఆచంట‌లో కింగ్‌మేకర్‌గా మారిన జ‌న‌సేన‌…

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట‌లో రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది.  మొత్తం 17 ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా అందులో టీడీపీ 7 చోట్ల‌, వైసీపీ 6 చోట్ల‌, జ‌న‌సేన 4 చోట్ల విజ‌యం సాధించింది.  ఎంపీపీ అధ్య‌క్షుడిగా ఎవ‌ర్ని ఎన్నుకోవాలి అన్నా జ‌న‌సేన స‌పోర్ట్ అవ‌స‌రం కావ‌డంతో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీటీసీల‌కు ఆక‌ర్షించేందుకు క్యాంపు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి.  జ‌న‌సేన పార్టీ ఎంపీటీసీలు కీల‌కం కావ‌డంతో జ‌న‌సేన ఆ పార్టీ ఎంపీటీసీల‌ను ర‌హ‌స్య‌ప్రాంతానికి త‌ర‌లించింది.  ఇటు టీడీపీ కూడా త‌మ ఏడుగురు ఎంపీటీసీల‌ను ర‌హ‌స్య‌ప్రాంతాల‌ను త‌ర‌లించింది.  ఆచంట ఎంపీపీని దక్కించుకోవ‌డానికి వైసీపీ మంత్రి రంగ‌నాథ‌రాజు, మాజీమంత్రి పితానీలు రంగంలోకి దిగారు.  దీంతో ఆచంట రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది.  

Read: ఆ దేశంలో యాంటీ వ్యాక్సిన్ ర‌డ‌గ‌: వంద‌లాదిమంది అరెస్ట్‌…రెండు వారాల‌పాటు సీజ్‌…

-Advertisement-ఆచంట‌లో కింగ్‌మేకర్‌గా మారిన జ‌న‌సేన‌...

Related Articles

Latest Articles