అర్ధ‌రాత్రి అల‌జ‌డిః చ‌ర్చిపైకి ఎక్కి… శిలువ‌కు నిప్పంటించాడు… కానీ…

అమెరికాలోని లాస్ ఎంజెలిస్‌లో ఓ వ్య‌క్తి అర్ధ‌రాత్రి అల‌జ‌డి సృష్టించాడు.  దాదాపుగా నగ్నంగా ఉన్న ఓ వ్య‌క్తి బోయిల్ హైట్ ఏరియాలోని సెయింట్ మేరీ క్యాథ‌లిక్ చ‌ర్చిపైకి ఎక్కి శిలువ‌కు నిప్పు అంటించాడు.  ఆ త‌రువాత అక్క‌డి నుంచి మ‌రో బిల్డింగ్‌పైకి దూకి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడు.  విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకొని ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  చ‌ర్చి శిలువ‌కు నిప్పు అంటించిన‌ప్ప‌టికీ ఆ మంట‌లు పెద్ద‌గా అంటుకొక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  అయితే,అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఆ వ్య‌క్తి ఎందుకు అలా చేశాడు, కారణాలు ఎంటి అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-