ఇన్ స్టాగ్రామ్ బద్ధలుకొట్టిన సింగర్! గంట 45 నిమిషాల్లోనే మిలియన్ ఫాలోయర్స్!

ప్రపంచాన్ని ఇప్పుడు కొరియన్ పాప్ మ్యూజిక్ సింగర్స్ తిరుగులేని విధంగా డామినేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి ఓ కే-పాప్ సింగింగ్ సెన్సేషన్ నిరూపించాడు. అయితే, మనం ఇప్పుడు చెప్పుకుంటోంది ‘బీటీఎస్’ గురించి కాదు. సౌత్ కొరియన్ పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ ఆల్రెడీ ప్రపంచాన్ని ఏలేస్తోంది. కానీ, దాని వెనకాలే రేసులో ఉంటోంది ‘ఎన్సీటీ’. ఇది కూడా కే-పాప్ సింగర్స్ తో కూడుకున్న మ్యూజిక్ బ్యాండే. టీమ్ ‘ఎన్సీటీ’లో భాగమే… ‘టెయిల్’…

ఎన్సీటీ మ్యూజిక్ బ్యాండ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచే సింగర్ ‘టెయిల్’ ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచాడు. అయితే, ఎంట్రీ ఇవ్వటంతోనే తన సత్తా ఏంటో చూపించేశాడు. కేవలం గంటా నలభై అయిదు నిమిషాల్లోనే మిలియన్ ఫాలోయర్స్ ని పోగేశాడు! అంత త్వరగా మిలియన్ మార్క్ దాటిన మరో ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఎవరూ ఇంత వరకూ లేరు! అందుకే, సింగర్ టెయిల్ ని రెండు గంటల్లోపే వన్ మిలియన్ ఫాలోయర్స్ మార్క్ క్రాస్ చేసినందుకు ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది!
ఎన్సీటీ పాప్ సింగర్ ‘టెయిల్’ తన పేరున ప్రపంచ రికార్డ్ నమోదు అయినందుకు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలు ఊహించలేదని అంటూ తన అభిమానులకి పేరుపేరున ధన్యవాదాలు తెలిపాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-