రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌పై ప‌వార్ కీల‌క వ్య‌ఖ్య‌లు…

ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ పవార్‌తో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ రెండుమార్లు భేటీ అయ్యారు.  శ‌ర‌ద్ ప‌వార్ తో భేటీ త‌రువాత ఆయ‌న అటు కాంగ్రెస్ కీల‌క నేత‌లైన రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీలతో భేటీ ఆయ్యారు.  అంతేకాదు, ఈ భేటీలో యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. రాబోయో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా శ‌ర‌ద్ ప‌వార్‌ను రంగంలోకి దించుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  దీనిపైనే ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌తిప‌క్షాల‌ను క‌లుస్తున్నారని క‌థ‌నాలు.  

Read: దుల్కర్ సల్మాన్ తో అక్కినేని హీరో మల్టీస్టారర్

ఈ క‌థ‌నాల‌పై శ‌ర‌ద్ ప‌వార్ స్పందించారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా బ‌రిలో ఉండ‌టం లేద‌ని, బీజేపీకి 300 మందికి పైగా ఎంపీలు ఉన్నార‌ని, అలాంటి స‌మ‌యంలో తాను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా నిల‌బ‌డ‌టం వ‌ల‌న ఉప‌యోగం ఉండ‌బోద‌ని, ఫ‌లితం ఎలా ఉంటుందో తెలుసున‌ని అన్నారు.  ప్ర‌శాంత్ కిషోర్ తో జ‌రిగిన భేటీలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబందించిగాని, 2024 ఎన్నిక‌ల‌కు సంబందించిగాని చర్చ‌కు రాలేద‌ని అన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-