బాలయ్య నెక్స్ట్ సినిమా డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్

నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంతో 2021లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందించిన రోరింగ్ హిట్ తో బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విజయంతో వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం బాలయ్య 107వ ప్రాజెక్ట్. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్. అలాగే ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా… మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్‌బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నుంచి డైలాగ్ లీక్ అయ్యింది.

Rea Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్

ఆ డైలాగ్ ను లీక్ చేసింది ఎవరో కాదు స్వయంగా డైరెక్టరే ! అసలు విషయం ఏమిటంటే.. బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోకు రవితేజతో పాటు గోపీచంద్ మలినేని కూడా హాజరయ్యారు. ఈ షోలో బాలయ్య మన సినిమాలో నుంచి ఒక డైలాగ్ లీక్ చేయండి అని అడగ్గా… గోపీచంద్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను వదిలారు. అదేంటంటే… “రోడ్డు మీదకు జింక, గొర్రె వస్తే ఎవడైనా హార్న్ కొడతాడు… అదే సింహం వస్తే హార్న్ కాదు కదా ఇంజిన్ కూడా ఆఫ్ చేసి సైలెంట్ గా ఉంటాడు.. అక్కడ ఉంది సింహం” అంటూ బాలయ్య పాత్ర హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పవర్ డైలాగ్ ను వదిలాడు. ఈ షో ప్రసారం అయినప్పటి నుంచి ఈ డైలాగ్ ట్రెండ్ అవుతోంది ”అన్ స్టాపబుల్’గా!!

Related Articles

Latest Articles